యెమెన్‌లో సమావేశమైన హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు జరిపాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. హూతీలు నౌకలపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం రావడంతో తాము ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. “ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.