TG: లోన్‌యాప్ వేధింపులు తాళలేక మరో యువకుడు బలైన ఘటన హైదరాబాద్ చోటుచేసుకున్నది. రూ. 15లక్షలు లోన్ తీసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సందీప్, యాప్ వేధింపులు భరించ లేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుగా తీసుకున్న రూ. 15లక్షలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడు సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ వాసిగా పోలీసులు గుర్తించారు.