బేతంచెర్ల మండల సర్వసభ్య సమావేశంలో బేతంచెర్ల మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రబీలో రైతులు సాగుచేయు పంటలకు ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని ఆదివారం తెలిపారు. బ్యాంకులలో ఋణం తీసుకున్న రైతులు బ్యాంకులలోనే చెల్లించాలని, అప్పు తీసుకోని రైతులు పంటల ప్రీమియంను మీ సేవా కేంద్రాలలో చెల్లించాలని ఏఓ తెలిపారు.