విద్యార్థులు చిన్నతనం నుండే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం పైన అవగాహన కలిగిఉండాలని అప్పుడు మాత్రమే సమాజంలో ఉండే సామాజిక దురాచారాలు, మూఢ నమ్మకాలను శాశ్వతంగా రూపుమాపవచ్చని ప్యాపిలి మండల డిప్యూటీ తహసీల్దార్ మారుతి పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల సందర్భంగా ప్యాపిలి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.