
బేతంచెర్లలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన కోట్ల
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి బేతంచెర్ల మండల కేంద్రంలో ఉమ్మడి కూటమి కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు తెలిపారు.