కర్నూలు మండలం ప్రజానగర్ లో కరగల్లు చిన్నా (25) ను ఆదివారం భార్య స్వరూపారాణిని భర్తను తలపై ఇనుప రాడ్ తో పదే పదే కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడని సీఐ శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరు తరుచుగా గొడవ పడేవారని, క్షణికావేశానికి గురైన స్వరూపరాణి భర్తను కొట్టి చంపేసి, అనంతరం తాలుకా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిందన్నారు.