కోసిగి: నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
సాతనూరులో పైప్ లైన్ పగలడం ద్వారా నీట మునిగిన పంటలను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లాకార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైప్లైన్ పగలడం ద్వారా నీటి మునిగిన పంటలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కొసిగి మండలంలోని సాతనరులో పులికనుమ ప్రాజెక్టుకు నీటి పంపిణీ చేసే స్టేజ్ వన్ పైప్లైన్ పరిశీలించారు.