భూమి రికార్డులను స్వచ్చి కరణ చేయాలి

647చూసినవారు
భూమి రికార్డులను స్వచ్చి కరణ చేయాలి
కోసిగి మండలంలో ఉన్న భూమి రికార్డులను పూర్తి స్వచ్చి కరణ చేయాలని తాహసిల్దార్ రుద్రగౌడ్ అన్నారు. శనివారం కోసిగి లోని తహసిల్దార్ కార్యాలయంలో వీఆ toర్వోలు, గ్రామ సర్వేయర్ తో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ రుద్రగౌడ్ మాట్లాడుతూ గతంలో తప్పుల తడకగా ఉన్న భూమి రికార్డులను సరి చేయాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రికార్డులను స్వచ్చి కరణ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ విఆర్వో లకు సర్వేలకు సూచించారు. గతంలో 1920 లో ఆర్ ఎస్ ఆర్ భూమి రికార్డులను సుమారు వంద సంవత్సరాలు క్రితం బ్రిటిష్ కాలంలో చేసినవి ఆ రికార్డులో కొన్ని తప్పులు ఉన్నందువల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని భూ రికార్డులను ఆన్లైన్లో స్వాచ్చి కరణ చేసి రైతులకు సమస్యలు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే ల అడంగల్ లో కూడా తప్పులు ఉన్నాయని కాబట్టి వాటిని వీఆర్వోలు గ్రామ సర్వేయర్ లో రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని భూమి రికార్డులను తప్పు లేకుండా ఆన్లైన్లో వారి రికార్డులను నమోదు చేయాలని ఆ రైతుకు సంబంధించిన సర్వేనెంబర్లు వ్యవసాయ భూమి విస్తీర్ణం వంటివి పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఆర్డిఓ రామకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా సమాచారం వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్ సీనియర్ అసిస్టెంట్ ముకుందరావు,మండల సర్వేయర్ బసవరాజ స్వామి , వీఆర్వోలు గ్రామ సర్వేయర్లు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్