మంత్రాలయంలో వెలసిన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.