పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన 1026 సిసి రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సిసి రోడ్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.