నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్ద గల కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కు సంబందించి నేర సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశం నందు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.