నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలును జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. పట్టణ నడి మధ్యన విశాలంగా ఉన్న మున్సిపల్ టౌన్ హాల్ ను ఎందుకు నిరుపయోగంగా ఉంచారని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. మునిసిపల్ టౌన్ హాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.