నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీవాసి పసుపుల సత్యనారాయణ మృతి చెందడంతో వారి కుమారులైన పసుపుల రవి, సుధాకర్, వెంటనే స్పందించి నేత్రదానం మంగళవారం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్, యోగా గురువు కండే ఆనంద్ గురూజి విషయాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరికి తెలిపి కర్నూల్ నుండి రెడ్ క్రాస్ ఐ టెక్నీషియన్స్ ను పిలిపించి సత్యనారాయణ నేత్రాలను సేకరించారు.