హోలీస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థుల మార్క్స్ నమోదు చేయడంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్టీటీఎఫ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు పి రాము అన్నారు. స్థానిక ఎస్టీటీఎఫ్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల రోల్ ఎక్కువగా ఉన్న చోట ఈ నమోదుకు చాలా సమయం పడుతుందని ఏప్రిల్ 23 లోపల వివరాలు నమోదు చేయడం సాధ్యమైన పని కాదని అన్నారు.