
నంద్యాల: క్రికెట్ బెట్టింగ్పై కఠిన చర్యలు: ఎస్పీ
నంద్యాల: క్రికెట్ మ్యాచ్లను వినోదంగా మాత్రమే చూడాలని, బెట్టింగ్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. IPL 2025 నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కుటుంబాలలో విషాదం నింపేలా ఉండకూడదని, అవకాశవాదులు, బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.