నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో కన్నుల పండుగగా జ్వాలాతోరణం, కోటిదీపోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆలయ కోనేరులో పుష్కరిణీకి హారతి కార్యక్రమం నిర్వహించారు. జ్వాలాతోరణం, కోటిదీపోత్సవం కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.