క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్త తెలిపారు. నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిడోత్సవ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్త మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమేనని, క్రీడలతో కుటుంబంతో పాటు దేశకీర్తిని నలుదిశలా చాటవచ్చని, క్రీడల ఆవశ్యకత గురించి తెలియజేశారు.