నంద్యాల పట్టణంలో శనివారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నంద్యాల మండలం కానాల గ్రామంలో రైతులు తమ పొలాలకు ఆయకట్టు రోడ్డు వేయించాలని, రైతునగరం, కానాల గ్రామాల రైతులు నంద్యాల నుంచి జమ్మలమడుగు వరకు 167కే జాతీయ రహదారి మంజూరులో గత వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు వారి రియల్ ఎస్టేట్ భూముల వ్యాపారం వృద్ది కోసం రైతుల పొలాల్లోకి జాతీయ రహదారి మల్లించి అన్యాయం చేశారన్నారు.