నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల నందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నూతన వధూవరులు రక్తదానం చేశారు. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల నందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర, చైర్మన్ విష్ణు గాయత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కుమారుడు సిదార్థ్, శ్రీ లేఖ నూతన వధూవరులు రక్తదానం చేశారు.