Sep 19, 2024, 05:09 IST/
గాంధీ దవాఖానలో మోగుతున్న మరణ మృదంగం
Sep 19, 2024, 05:09 IST
గాంధీ దవాఖానలో మరణ మృదంగం మోగుతున్నది. ఆగస్టు ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది తల్లులు మృత్యువాత పడినట్టు సమాచారం. ఎంతో మంది ప్రాణాలు కాపాడి దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన గాంధీ ఆసుపత్రిలో కొందరి నిర్లక్షం ఎంతోమంది ప్రాణాలను బలికొంటుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవారే లేకపోవడంతో మృత్యుబారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.