విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి
అవుకు మండలం సంఘ పట్నం గ్రామ పరిధిలో సోమవారం నాపరాతి గనుల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో గని కార్మికుడు మృతి చెందాడు. అవుకు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బెలుం గ్రామానికి చెందిన పీటర్ (45) దినచర్యలో భాగంగా నాపరాతి గనులు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.