రైతులకు తలెత్తిన భూ సమస్యలను పరిష్కరించడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం హుసేనాపురంలో గ్రామసభ నిర్వహించారు. సభకు తహసీల్దార్ విద్యాసాగర్, రీసర్వే డీటీ శర్మిలారెడ్డి హాజరై, మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.