జాబ్ కార్డు ఉన్న కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కల్లూరు ఎంపీడీవో నాగశేషాచలరెడ్డి సూచించారు. కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరులో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో మాట్లాడారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఉపాధి పనులు కల్పించి, మండలంలో వలసలు నివారించాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మన్న, ఎంపీటీసీ సామన్న తదితరులు పాల్గొన్నారు.