
23న పత్తికొండలో జాబ్ మేళా
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాధురి తెలిపారు. జాబ్ మేళాలో అమర్ రాజా గ్రూపు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.