T20 ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసింది. ఇందులో టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్‌కు చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 856 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ 829 పాయింట్లతో 2వ ర్యాంకు, తిలక్ వర్మ 804 పాయింట్లతో 4వ ర్యాంకు, సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో 5వ ర్యాంకును దక్కించుకున్నారు.