కోడుమూరు: రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

53చూసినవారు
కోడుమూరు మండలంలో శనగ పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చునని డాట్ సెంటర్ శాస్త్రవేత్త కిషోర్ కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని ముడుమలగుర్తిలో ఏవో రవిప్రకాష్, జిల్లా వనరుల కేంద్రం ఏవో నాగ సరోజమ్మతో పాటు రైతులతో కలిసి శనగ, జొన్న, కంది పంటలపై పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, మాట్లాడారు. పంటల సాగులో మెళుకువలు రైతులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్