ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు, నాణ్యమైన ఆహారం అందించాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య అన్నారు. శనివారం జేసీ వెల్దుర్తిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, మాట్లాడారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.