పత్తికొండ: రాష్ట్రస్థాయి ఉద్యమాలకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలి

81చూసినవారు
పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిల చెల్లింపులపై రాష్ట్రస్థాయి ఉద్యమాలకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని కర్నూలు జిల్లా ఎస్టీయూ నాయకులు రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పత్తికొండ ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల నాయకులు పాల్గొని, మాట్లాడారు. డిసెంబర్ లో జరగనున్న వార్షిక కౌన్సిల్ సమావేశంపై వారు చర్చించారు.

సంబంధిత పోస్ట్