నంద్యాల జిల్లా మహానంది మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో పొలాలు, లోతట్టు ప్రాంతలలో వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అరటి పంట, వరి, మొక్కజొన్న పంటలలో వర్షపు నీరు చేరి రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇంకా భారీ వర్షాలు కొనసాగితే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు.