తుఫాన్ దెబ్బకు అన్నదాత విలవిల..నీటి మునిగిన వరి పంట

58చూసినవారు
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోదాదాపు పదివేల హెక్టార్లలో అన్నదాతలు వరి నాట్లు వేసుకున్నారు. ఒక ఎకరాకు పదివేల నుండి 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే ప్రస్తుత తుఫాన్ దెబ్బకు అన్నదాత విలవిలలాడుతున్నాడు. ఎడతెరపి లేకుండా వర్షాలు పడడంతో వాగులు వంకలు పొర్లుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పంటలు నీటి మునిగాయి. ఆదివారం రైతులు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్