Mar 21, 2025, 16:03 IST/
ఆరు గ్యారంటీలకు ₹56 వేల కోట్ల ఖర్చు పెడతాం: భట్టి
Mar 21, 2025, 16:03 IST
గత BRS ప్రభుత్వ హయాంలో GST వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. '6 గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేం బడ్జెట్లో పొందుపరిచాం. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి BRS ఏం సాధించింది?' అని ప్రశ్నించారు.