వైసీపీ నేత అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దాంతో అపార్ట్‌మెంట్‌ను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ నిర్మాణం ప్లాన్‌కు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టామని కమిషనర్ తెలిపారు.