భర్త కుమారుడిని ఎత్తుకోలేదనే కోపంతో ఓ వివాహిత కొడుకుతో కలిసి ఇంటిలోంచి వెళ్లిపోయింది. పటాన్ చెరు ఇస్నాపూర్ వడ్డెరకాలనీలో ఉంటున్న సాయికుమార్, అతని భార్య లక్ష్మి 11నెలల కుమారుడు ప్రణయ్‌తో కలిసి శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కుమారుడిని ఎత్తుకోమని భర్తను కోరింది. అతను ఎత్తుకోకుండా వెళ్లిపోగా.. లక్ష్మీ ఇంటికొచ్చింది. అయితే మధ్యాహ్నం ఇంట్లో భార్య, కుమారుడు కన్పించకపోవడంతో సాయికుమార్ పటాన్‌చెరు పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.