గైర్హాజరైన అధికారులకు నోటీసులు పంపిస్తాం
వెల్దుర్తి మండల ప్రజాపరిషత్ ఆఫీసులో గురువారం ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. కాగా కొందరు మండల అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారందరికీ నోటీసులు పంపిస్తామని ఎంపీడీవో తెలిపారు. ఎంపీపీ రంగయ్య, జడ్పీటీసీ సుంకన్న, మాజీ ఎంపీపీ బొమ్మన సరళారవిరెడ్డి, సర్పంచి శైలజ తదితరులు పాల్గొన్నారు.