తోపుడు బండ్ల వ్యాపారులకు కౌన్సిలింగ్ : ట్రాఫిక్ ఎస్సై

2986చూసినవారు
తోపుడు బండ్ల వ్యాపారులకు కౌన్సిలింగ్ : ట్రాఫిక్ ఎస్సై
ఎమ్మిగనూరు పట్టణంలో తోపుడు బండ్లు, ఇతర బండ్లు రోడ్డుపైన పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని బండ్ల యజమానులకు ట్రాఫిక్ ఎస్సై వెంకట సురేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య కూరగాయల బండ్లు, తోపుడు బండ్లు వ్యాపారస్తులు రోడ్డు పై ఉంచి విక్రయాలు నిర్వహిస్తున్నారు. కూరగాయల మార్కెట్, గాంధీ విగ్రహం, సోమప్ప సర్కిల్, వద్ద పరిసరాల ప్రాంతంలో తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు పండ్లు విక్రయాలు నిర్వహిస్తుండడం వల్ల రోడ్డు పై రద్దీగా మారి వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల పై ఉండే తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా రహదారికి అడ్డుగా వాహనాలు, ఆటోలు నిలపడం వల్ల ట్రాపిక్‌ సమస్య తలెత్తుతోందన్నారు. వాహనాలను పార్కింగ్‌ స్థలంలోనే నిలుపుదల చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్‌ సమస్యతలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అలానే హైవేపై వాహనాలు వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని అందు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని, కొన్ని సందర్భాలలో ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా చిరు వ్యాపారం యూనియన్ సభ్యులతో మాట్లాడి ట్రాఫిక్ ఆటంకం కలిగించవద్దని తెలిపారు. అలా కాదని ఎంత చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :