
ఎమ్మిగనూరు: నారాయణ పాఠశాలలో ఘనంగా రైతుల దినోత్సవ వేడుకలు
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక నారాయణ పాఠశాలలో ఏ. జియం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పిల్లలను పొలాలకు తీసుకెళ్లి రైతుల పడుతున్న కష్టాలు గురించి పంటలపై ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపిస్తూ వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక లాంటివాడని, రైతు లేనిదే మనిషి లేరని అన్నారు.