AP: ఐదేళ్లలో ఏపీ విద్యావ్యవస్థను నంబర్ 1గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్యలో సమూల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ అనాలోచన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షల విద్యార్థుల తగ్గుదల నమోదయ్యిందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌తో సహా రూ.6,500 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు.