ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి దోహదం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త చెప్పారు. విమానాశ్రయ సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అనుకున్న గడువు కంటే ఆరు నెలలు ముందే పనులు పూర్తి చేసేలా నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా భోగాపురం విమానాశ్రయం పనులను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.