ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరలు తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరలు తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.