మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు విచారణ చేసిన కేసు మొత్తం వివరాలను సీఐడీకి పోలీసులు అప్పగించనున్నారు. గత నెల 21న రాత్రి కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం అయ్యాయి. ఈ ఘటనపై పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.