‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎడిటర్ రూబెన్ ఎక్స్ వేదికగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఈ సినిమాలో రామ్ చరణ్.. ఎన్ని పాత్రల్లో కనిపిస్తారు?’ అని ఒకరు ఆయనను అడిగారు. దానికి రూబెన్.. "కథానాయకుడి పాత్ర విభిన్న కోణాల్లో ఉంటుందన్నారు. అది ద్విపాత్రాభినయమా, త్రిపాత్రాభినయమా? అనేది థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ చూస్తే దాదాపు క్లారిటీ వస్తుంది." అని చెప్పారు.