కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

80చూసినవారు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం వద్ద శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సరాక కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రియాక్టర్ పేలింది. దాంతో స్థానిక ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.