మహానందిలో చిరుత పులి కలకలం

63చూసినవారు
మహానందిలో చిరుత పులి కలకలం
AP: నంద్యాల జిల్లాలోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం మహానందిలో చిరుత పులి సంచారం క‌ల‌క‌లం రేగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోశాల వద్దకు చిరుత పులి రావ‌డం సీసీ కెమెరాల్లో న‌మోదైంది. గ‌త 20 రోజులుగా చిరుత సంచరిస్తున్నా అధికారులు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని స్థానికులు, భ‌క్తులు మండిప‌డుతున్నారు.

సంబంధిత పోస్ట్