శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఆయన.. ప్రజలకు స్వయంగా టిఫిన్ వడ్డించారు. అనంతరం పక్కనే ఉన్న ఓ జిమ్‌ను ఓపెన్ చేశారు. అక్కడ కాసేపు కసరత్తులు చేశారు. దాంతో అభిమానులు ‘జై బాలయ్య.. జై బాలయ్య..’ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.