ఏపీ టెట్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో నమూనా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. https://aptet.apcfss.in/లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల అక్టోబర్ 3 నుంచి జరిగే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాసే వీలుంటుంది. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఏపీ టెట్‌కు 4.27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.