ఏపీలో ఆర్అండ్‌బీ రహదారులకు మోక్షం లభిస్తోంది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 2న పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో టెండర్ల దశలో ఉంటే మరికొన్నిచోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 97 కి.మీ మేర గుంతలు పూడ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర రహదారుల్లో 233 కి.మీ, జిల్లా రహదారుల్లో 399 కి.మీలు గుంతల రహితంగా మారాయి.