విజయవాడలో కాలనీల్లోకి కొట్టుకొచ్చిన బురదను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగ్ నగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు బీఆర్టీఎస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ఫైరింజన్లు చేరుకున్నాయి. మరోవైపు నాలుగు వేల పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.