AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఉండవల్లిలో ఓ మహిళ హత్య కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు.