ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి (డాక్టర్ సుజాత) హాస్పిటల్ నందు మంగళవారం ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే మహిళ పురిటి నొప్పులతో హాస్పిటల్లో చేరడం జరిగింది. డాక్టర్ హనీషా, డాక్టర్ యశ్వంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించడం జరిగింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.