ఆళ్లగడ్డ మండలంలోని గూబ గుండం మెట్ట వద్ద జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన అన్నదాత సీడ్స్ హరికృష్ణ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల నుండి ఆళ్లగడ్డకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలి పల్టీలు కొట్టింది. బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. హరికృష్ణ రెడ్డి, రామసుబ్బమ్మ, నాగలక్ష్మి గాయపడ్డారు.